ఢిల్లీలో జరిగిన 2వ “ఖేలో ఇండియా-2025” పారా క్రీడలలో నేత్ర విద్యాలయం క్రీడాకారులు ఏడు పతకాలు దక్కించుకున్నారు.. ఢిల్లీ వేదికగా, జవహర్ లాలా నెహ్రూ స్టేడియంలో ఈ నెల 21 నుండి 23 వరకు “ఖేలో ఇండియా-2025” పారా గేమ్స్ నిర్వహంచారు.. ఈ పోటీలలో త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో నడుస్తున్న మన నేత్ర విద్యాలయం విద్యార్థులు వివిధ క్రీడా విభాగాలలో పోటీ పడ్డారు. ఈ పోటీలలో రెండు స్వర్ణాలు, అయిదు రజితాలతో మొత్తం ఏడు కైవసం చేసుకున్నారు..

ఇండియా స్పోర్ట్స్ అథారిటీ వారు నిర్వహించిన ఈ పోటీలో భారతదేశంలోని 29 రాష్ట్రాలు పాల్గొనగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు 10 పతకాలను సాధించాయి. అందులో “7” పతకాలను మన నేత్రవిద్యాలయం విద్యార్థులు సాధించటం విశేషం.

విజేతల వివరాలు
- కుమారి లలిత K. 200 మీటర్ల పరుగులో స్వర్ణం
- కుమారి రవని V. 100 మీటర్ల పరుగులో స్వర్ణం
- కుమారి లలిత K. 400 మీటర్ల పరుగులో రజతం
- కుమారి రవని V. 200 మీటర్ల పరుగులో రజతం
- కుమారి శిరీష 100 మీటర్ల పరుగులో రజతం
- . అంబటి స్వరాజ్ 100 మీటర్ల పరుగులో రజతం
- అంబటి స్వరాజ్ T 11, లాంగ్ జంప్ లో రజతం
పతకాల విజేతలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా స్పోర్ట్స్ అథారిటీ అభినందనలు తెలుపగా, శ్రీ చిన్నజీయర్ స్వామివారు తమ మంగళాశాసనములు కృపచేశారు.