Sp | ఆత్మహత్య ఘటన పై కేసు నమోదు

Sp | ఆత్మహత్య ఘటన పై కేసు నమోదు
అన్ని కోణాల్లో దర్యాప్తు
వెల్లడించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
Sp | మక్తల్ ఆంధ్రప్రభ; మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 06వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప ( 44 ) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మృతుడి భార్య ఎరుకలి సత్యమ్మ ఫిర్యాదు మేరకు మక్తల్ పోలీస్ స్టేషన్లో 194 BNSS సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి ఈ ఘటనకు సంబంధించి నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకుండా సహకరించాలని ప్రజలను జిల్లా ఎస్పీ కోరారు.
