Social Media | కట్న వేధింపుల ఆరోపణలు.. భర్తపై కేసు

Social Media | కట్న వేధింపుల ఆరోపణలు.. భర్తపై కేసు
Social Media | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మియాపూర్‌లో వివాహం జరిగిన నెల రోజుల్లోనే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. కట్న వేధింపులే ఈ ఘటనకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బీహార్‌కు చెందిన ఇషికా యాదవ్, మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సల్ 2020లో సోషల్ మీడియా ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. పెద్దల సమ్మతితో 2026 ఫిబ్రవరి 20న వివాహం జరిగింది. అనంతరం హైదరాబాద్‌లోని మియాపూర్ మక్త మహబూబ్‌పేట్‌లో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు.
అయితే, పెళ్లి తర్వాత కొద్దిరోజుల్లోనే అదనపు కట్నం కోసం భర్త వేధింపులు ప్రారంభించాడని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. భర్త వేధింపులు భరించలేక మనస్తాపానికి గురైన ఇషికా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
