అ*ధర*హో..
ఆకాశానంటుతున్న అరటి ధరలు
ఒక్కొక్క గెల 300 నుంచి 500 రూపాయల పలుకుతున్న ధర..
కార్తీక మాసం కావడంతో గిరాకీ..
లావేరు(శ్రీకాకుళం),అక్టోబర్21(ఆంధ్ర ప్రభ): కార్తీక మాసం, శుభకార్యాలయాలు, యాత్రలు ప్రారంభం కావడంతో అరటి పండ్ల ధరలు అ మాంతంగా పెరిగాయి. గెలకొనాలంటే చుక్కలు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే అరటిని పండించిన రైతు కంటే వాటిని తోటల్లో కొనుగోలు చేసి మార్కెట్ కు తరలించే దళారులకే అధిక మొత్తంలో లాభాలు దక్కుతున్నాయి. ప్రధానంగా వివాహ శుభకార్యాల్లో అయ్యప్ప భవాని కార్తీక మాసం చేసే పూజల్లో అరటి పండ్ల ను పెట్టడం ఆనవాయితీ కావడంతో వీటికి డిమాండ్ పెరిగింది. సంతల్లో డిమాండ్ శ్రీకాకుళం జిల్లాలో అతిపెద్ద సంత బుడుమూరులో ప్రతి సోమవారం జరిగే వారపు సంతకు ముందు రోజే రణస్థలం,పొందూరు, లావేరు జి.సిగడం, ఎచ్చెర్ల తదితర ప్రాంతాల నుంచి అరటి గెలలో వస్తుంటాయి. వెంటనే దళారీలు కొనుగోలుదారులు వచ్చి అరటి గెలలు కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్లో డజను అరటి పళ్లు 50 రూపాయలు వంతెన అమ్ముతున్నారు.
అరటి గెల రూ.400
మార్కెట్లో 10 నుంచి 12 డజన్లు ఉండే అరటి గెల 400 రూపాయలకు పలుకుతుంది. పెళ్లిళ్లు సంబరాలు పండుగలు చేసే వారంతా నాలుగు రోజులు ముందుగానే ఈ అరటి గెలలు కొనుగోలు చేసి తన ఇళ్లకు తీసుకు వెళుతున్నారు. ప్రస్తుతం సాధారణ రకమైన అరటి పళ్లు వస్తున్నాయి. ఎచ్చర్ల నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతంలో పండిస్తున్న రైతులు కర్పూర పవన్ జాతికి చెందిన రకాలు విక్రస్తున్నారు. ఇవి చాలా చిన్న పరిణామములు ఉంటాయి. ఇందులో నాణ్యత ఉన్న గెలలకు మంచి ధర లభిస్తుంది. అమృతపాణి, చక్కెర కేలి గెల 400 రూపాయలు దాటి పలుకుతుంది. గతంలో సాధారణ రకం అంటి పండ్లు కు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. 250 రూపాయల పెడితే అరటి గెల వచ్చేది. ఇప్పుడు ధరల అమాంతంగా పెరిగాయి. మంచి డిమాండ్ ప్రస్తుతం అరటి గెలలు రేట్లు పెరగడంతో వినియోగించాలంటే భయం వేస్తుంది. శుభకార్యాలకు తప్పనిసరిగా కొనవలసి వస్తుంది.
అరటి పంటలో దళారుల హవా
ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు అరటి పంటను అమ్ముకోవడానికి సంతకు తీసుకొని వెళితే అక్కడ దళారులు ప్రత్యక్షమై వీరి దగ్గర అతి తక్కువ కొన్ని ఐదు రెట్లు అధికం అమ్ముతున్నారు. పండించే రైతు కు కొనుగోలు చేసే వారికి నష్టాలే తప్ప లాభం ఉండదు. మధ్యలో దళారులకే అత్యధిక లాభాలు సంపాదించుకుంటున్నారు. కార్తీక మాసం రావడంతో అరటి గెలల ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పవచ్చు.