Breaking | రైలు ఢీకొని… ఆరుగురు మృతి

రైలు ఢీకొని… ఆరుగురు మృతి
మీర్జాపూర్ : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మీర్జాపూర్ జిల్లా చునార్ రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం… చోపాన్ ఎక్స్ప్రెస్ రైలులో నుంచి దిగిన ప్రయాణికులు పట్టాలు దాటుతుండగా, అప్పటికే ఎదురుగా వస్తున్న నేతాజీ ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ప్రయాణికులు గంగానది (ganganadi) లో పవిత్ర స్నానం చేసేందుకు చోపాన్ ప్రాంతం నుంచి వారణాసికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఘటన స్థలానికి పోలీసులు, రైల్వే అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
