SI Chandrasekhar | మొన్న భార్య… నేడు భర్త

SI Chandrasekhar | మొన్న భార్య… నేడు భర్త
టూ టౌన్ ఎస్ఐ చంద్ర శేఖర్ బలవన్మరనం..
SI Chandrasekhar | జమ్మికుంట ఆంధ్రప్రభ : కరీంనగర్ టూ టౌన్ లో పనిచేస్తున్న ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఇటీవల చంద్రశేఖర్ భార్య దివ్య గన్నేరు పప్పు తిని బలవన్మరణానికి పాల్పడిన విషయం విధితమే. ఇల్లంతకుంట మండలం సీతంపేట పేట స్వగ్రామంంలో దివ్య అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల అనంతరం సీతంపేట లో ఎస్ఐ చంద్ర శేఖర్ ఉన్నారు.భార్య మృతి చెందడంతో మనస్థపానికి గురై అత్త గారింట్లో ఉరి వేసుకొని బలవన్మారణానికి పాల్పడ్డాడు. చంద్రశేఖర్ మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. కరీంనగర్ సిపి గౌస్ అలంతో పాటు అధికారులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

కరీంనగర్‌లో వరుసగా చోటుచేసుకున్న కుటుంబ విషాదాలు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు ఆత్మహత్యలకు పాల్పడడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అత్తింట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఐదు రోజుల క్రితమే ఆయన భార్య దివ్య కూడా ఆత్మహత్య చేసుకుంది. గన్నేరు పప్పు దంచుకొని ప్రాణాలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ వరుస ఘటనలు స్థానికంగా విషాదాన్ని మిగిల్చాయి. ఎస్ఐ కి ఇద్దరు పిల్లలున్నారు. ఆత్మహత్యలకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
