Shivaji Controversy | అనసూయ షాకింగ్ కామెంట్స్..

Shivaji Controversy | అనసూయ షాకింగ్ కామెంట్స్..
Shivaji Controversy | మహిళల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు వివాదానికి దారి
“మా బాడీ మా ఇష్టం” అంటూ అనసూయ స్పందన
సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతున్న వివాదం
చీర వీడియోపై అనసూయ కౌంటర్
శివాజీ–అనసూయ మధ్య మళ్లీ కోల్డ్ వార్?
Shivaji Controversy | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సీనియర్ నటుడు శివాజీ.. మహిళల వస్త్రధారణ పై కామెంట్స్ చేయడం.. దీనికి అనసూయ రియాక్ట్ అవ్వడం తెలిసిందే. సినీ పరిశ్రమలోని పలువురు మహిళలు రియాక్ట్ అవ్వడం.. శివాజీ పై విమర్శలు చేయడంతో వివాదస్పదం అయ్యింది. ఆతర్వాత శివాజీ సారీ చెప్పడం జరిగింది. అయితే.. ఈ వివాదం ముగిసింది అనుకుంటే.. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ.. మళ్లీ ఏమైంది..?
Shivaji Controversy | శివాజీ ఉద్దేశ్యం మంచిదే కానీ..

శివాజీ ఉద్దేశ్యం సరైనదే కావొచ్చని కొందరు భావించినా, ఆయన ఉపయోగించిన భాష, వ్యాఖ్యల తీరు మాత్రం అనుచితంగా ఉందని చాలా మంది విమర్శించారు. ఇదే సందర్భంలో అనసూయ కూడా తనదైన శైలిలో స్పందించి “మా బాడీ మా ఇష్టం” అంటూ మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను ప్రస్తావించారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. కొంతకాలం తర్వాత ఈ వివాదం చల్లారినట్టు కనిపించినా, అప్పుడప్పుడు ఈ టాపిక్ మళ్లీ తెరపైకి వస్తూనే ఉంది. ఇటీవల మరోసారి ఇదే అంశం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.
Shivaji Controversy | శివాజీ దెబ్బతో చీర కట్టుకుని తిరుగుతున్న..

ఏదైనా హీరోయిన్ లేదా నటి సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తే, దాన్ని శివాజీ వ్యాఖ్యల ప్రభావంగా చూపిస్తూ కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో అనసూయ చీర కట్టుకున్న వీడియోను పెట్టి.. శివాజీ దెబ్బతో చీర కట్టుకుని తిరుగుతున్న అనసూయ అంటూ ఓ మీడియా సంస్థ తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ పెట్టారు. ఈ వీడియో పై అనసూయ రియాక్ట్ అయ్యారు. తప్పు తప్పు.. శివాజీ సృష్టించిన చీర అనే వస్త్రాన్ని ధరించి తిరుగుతున్న అనసూయ.. ఇది కదా హెడ్డింగ్ ఉండాల్సింది.. ఎందుకంటే.. అంతకు ముందు మేమంతా చీరలే కట్టుకోలేదు.. ఏంటమ్మా.. చూసుకోవాలి కదా.. పోస్ట్ చేసే ముందు అంటూ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. ఈ కామెంట్స్ తో ఆమె తన అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తం చేశారు.
Shivaji Controversy | ముగుస్తుందా..? ముదురుతుందా..?

దీంతో మళ్లీ శివాజీ–అనసూయ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు. కొందరు అనసూయకు మద్దతు ఇస్తుండగా, మరికొందరు శివాజీ అభిప్రాయాలను సమర్థిస్తున్నారు. అయితే ఈ తాజా పరిణామాలపై శివాజీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా? లేక మళ్లీ మరింత ముదురుతుందా? అనేది వేచి చూడాల్సిందే.

