పాక్ అధ్య‌క్షుడి స్వామి భ‌క్తి

ట్రంప్‌పై ష‌రీఫ్ మ‌ళ్లీ పొక‌డ్త‌లు

ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్ డెస్క్ : దక్షిణాసియాలో శాంతిని పునరుద్ధరించింది, ఒక పెద్ద యుద్ధాన్ని నివారించింది.. లక్షలాది మంది ప్రజలను రక్షించింది.. అమెరికా అధ్య‌క్షుడు ట్రంపేనంటూ పాకిస్తాన్ అధ్య‌క్షుడు న‌వాజ్ ష‌రీఫ్ మ‌రో మారు చెప్పుకొచ్చారు. గ‌త మేనెల‌లో భార‌త్‌- పాక్ వివాదాన్నిఊటంకిస్తూ అజర్‌బైజాన్ విజయ దినోత్సవ కవాతులో పాక్ అధ్య‌క్షుడు ట్రంప్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

నాలుగు రోజుల పాటు జరిగిన తీవ్రమైన సరిహద్దు డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత మే 10న భారత్ – పాకిస్తాన్ మధ్య వివాదాన్ని ముగించడానికి ఒక అవగాహన కుదిరిందని, ఈ ప్రక్రియలో మూడవ పక్షం పాల్గొనలేదని న్యూఢిల్లీ నిరంతరం చెబుతోంది. అయితే, ష‌రీఫ్ మాత్రం త‌న స్వామిభ‌క్తిని మ‌రోమారు ప్ర‌ద‌ర్శిస్తూ. ట్రంప్‌ది సాహసోపేతమైన నిర్ణయాత్మక నాయకత్వం అని పొక‌డ్త‌ల‌తో ముంచెత్తాడు.

Leave a Reply