అర్జున్ రెడ్డి సినిమాతో సక్సెస్ కొట్టిన విజయ్ దేవరకొండ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐతే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే మాత్రం కెరీర్ లో సక్సెస్ అవ్వలేకపోయింది. షాలిని తెలుగులో కొన్ని సినిమాలు చేసినా ఆమెకు అంతగా క్రేజ్ రాలేదు. కాస్త బొద్దుగా మారడం సమస్య అయ్యిందని గుర్తించిన ఆమె స్లిమ్ గా మారి షాక్ ఇచ్చింది.
ఐతే అలా మారినా కూడా అమ్మడికి ఛాన్స్ లు రావట్లేదు. షాలిని కంబ్యాక్ ఎప్పుడు ఇస్తుందా అని ఆమెని ఇష్టపడే ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అటు కోలీవుడ్, బాలీవుడ్ లో అమ్మడు చేసిన ప్రయత్నాలు కూడా వర్క్ అవుట్ కాలేదు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఎలాంటి సినిమా అయినా, పాత్ర అయినా చేస్తూ వస్తుంది షాలిని కానీ ఎందుకో ఆమెకు అక్కడ లక్ కలిసి రావట్లేదు. టాలీవుడ్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది షాలిని.
ఇక్కడ డైరెక్టర్స్ తో రెగ్యులర్ టచ్ లో ఉంటుందని టాక్. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమాలు చేస్తున్న హంగామా తెలిసిందే. అందుకే షాలిని ఇక్కడ మళ్లీ ఫాం లోకి రావాలని, వరుస ఆఫర్లు అందుకోవాలని ట్రై చేస్తుంది. షాలిని పాండే తిరిగి సినిమా అవకాశాలు అందుకుంటే మాత్రం ఆమె ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే.


