Shad Nagar | గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా

Shad Nagar | గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా
- భీమారంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
- సర్పంచ్ ఏలుకుర్తి గీతా వీరేశం గుప్తా
- బీమారం గ్రామ సర్పంచ్ గా ఏలుకుర్తి గీతా వీరేశం గుప్తా, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం
Shad Nagar | షాద్ నగర్, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, భీమారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నూతనంగా ఎన్నికైన భీమారం గ్రామ సర్పంచ్ ఏలుకుర్తి గీతా వీరేశం గుప్తా అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని బీమారం గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ ఏలుకుర్తి గీతా వీరేశం గుప్తా, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

ఈసందర్భంగా ఏలుకుర్తి గీతా వీరేశం గుప్తా మాట్లాడుతూ… గ్రామ ప్రజలు తనను ఆదరించి భారీ మద్దతుతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, మౌలిక వసతుల కల్పనతో పాటు పరిశుభ్రత, తాగునీరు, డ్రైనేజీ, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని సమిష్టిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, యువత, ప్రజలు నియోజక వర్గంలోని వివిధ ప్రాంతాల నుండి ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొని నూతన సర్పంచ్, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి పూలమాల, శాల్వతో ఘనంగా సన్మానించారు.
