పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్ ప్యాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు”.
పవన్ కళ్యాణ్ తొలిసారిగా వారియర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు దాదాపు ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు, అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమా విడుదల కానుంది.
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ‘‘మాట వినాలి’’ అనే మొదటి సింగిల్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. ఇక తాజాగా, ఈ సినిమాలోని రెండో పాటకు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా, ఈరోజు వారి మధ్య డ్యూయెట్ సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పాటను ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు.
ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా… మార్చి 28న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.