sensex1500| లాభాల్లో స్టాక్ మార్కెట్‌

sensex1500| లాభాల్లో స్టాక్ మార్కెట్‌

sensex1500| చేకూరిన అంతర్జాతీయ సానుకూలతలు
లాభాల్లో మన దేశీయ మార్కెట్లు
సానుకూల రాజకీయ పరిణామాలు
తాత్కాలిక విరామం ప్రకటించడం వల్ల

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నిన్నటి భారీ పతనం తర్వాత ఇవాళ భారతీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై ఐదు రోజులపాటు యద్ధం నిలిపివేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో చేకూరిన అంతర్జాతీయ సానుకూలతలు, అమెరికా మార్కెట్ల నుండి అందుతున్న అనుకూల సంకేతాలు, ఆపై.. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం మన మార్కెట్లకు కలిసొచ్చింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా సానుకూలంగా స్పందించాయి. దీంతో మంగళవారం మన దేశీయ మార్కెట్లు లాభాల్లో ప్రారంభించాయి. సెన్సెక్స్​ 1500 పాయింట్ల, నిఫ్టీ 300 పాయింట్ల వరకు పైనే పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం మన ఆర్థిక వ్యవస్థకు, రూపాయి విలువకు సానుకూలంగా మారింది. సానుకూల రాజకీయ పరిణామాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి.

sensex1500
sensex1500

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం గట్టిగా లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక విరామం ప్రకటించడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. ఈ పరిణామానికి ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. దాంతో భారత మార్కెట్లలోనూ కొనుగోలు ఉత్సాహం కనిపించింది.
దీని ప్రభావంగా ప్రధాన సూచీలు బలంగా ఎగబాకాయి. సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లకు పైగా లాభంతో దూసుకెళ్లగా, నిఫ్టీ కూడా 300 పాయింట్లకు పైగా పెరిగింది.

ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 1079 పాయింట్ల లాభంతో 73,775 స్థాయిలో ట్రేడవుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ 337.4 పాయింట్లు ఎగబాకి 22,848.80 వద్ద కొనసాగుతోంది. అయితే రూపాయి విలువ మాత్రం కాస్త బలహీనంగానే ఉంది. నేటి ట్రేడింగ్‌లో రూపాయి మరో 18 పైసలు తగ్గి డాలర్‌తో పోలిస్తే 93.71 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ సూచీలో ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేర్లు మంచి లాభాలు నమోదు చేస్తున్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ, ఫార్మా రంగాలకు చెందిన షేర్లు 1-2 శాతం వరకు పెరుగుదలతో ట్రేడవుతున్నాయి.

Leave a Reply