Selected | రాష్ట్రస్థాయి హాకీ క్రీడలకు..

Selected | రాష్ట్రస్థాయి హాకీ క్రీడలకు..

  • ఎంపికైన పల్లికొండ విద్యార్థులు

Selected | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : ఈనెల 8 నుండి 10 వరకు వనపర్తి జిల్లాలో జరగనున్న ఎస్‌జేఎఫ్‌ అండర్ -17 ఇయర్స్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు మండలంలోని పల్లికొండ విద్యార్థులు మాలవత్ అఖిల, కొత్తపల్లి శ్రీనిత్ ఎంపికయ్యారు. గత రెండు నేలలో జరిగిన ఎస్‌జేఎఫ్ అండర్ -14 బాల బాలికల విభాగంలో ఎర్రోళ్ల ధనాశ్రీ, భూక్యా స్నేహ, బందెల చైతన్య ఎంపికయ్యారు. అలాగే ఎస్‌జేఎఫ్ అండర్ -19 ఇయర్స్ విభాగంలో గంధం నక్షత్ర, దేవానపల్లి వర్షిత, పిండి వర్షిణి, మగ్గిడి దీక్షిత, పంగ రాము, మేకల రేవంత్ ఎంపికై రాష్ట్ర స్థాయిలో ఆడారు.

వీరిని పల్లికొండ గ్రామ సర్పంచ్ గొల్లపిండి మనుష అశోక్‌… క్రీడాకారులకు మాతోడోర్ హాకీ స్టిక్స్ ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనురాధ, సీనియర్ ఉపాధ్యాయలు శ్యామ్, విట్టల్ గౌడ్, ఉపాధ్యాయ బృందం, ఉప సర్పంచ్ ఏనుపోతుల చిన్న బాలయ్య, వీడీసీ దేవన్‌పల్లి రాజన్న, వేంపల్లి అశోక్, రావూట్ల నాగయ్య, స్థానిక పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ చిన్నయ్య తదితరులు తెలిపారు.

Leave a Reply