School | హోంవర్క్ చేయలేదని..

School | హోంవర్క్ చేయలేదని..
- విద్యార్థిని చితకబాదిన టీచర్
School | హనుమకొండ, ఆంధ్రప్రభ : పెగడపల్లి సమీపంలోని ఏకశిలా ప్రైవేట్ పాఠశాల(Ekshila Private School)లో 4వ తరగతి చదువుతున్న బాలిక హోంవర్క్(Homework) చేయలేదని ఓ మహిళా టీచర్ చితకబాదింది.
దీంతో ఆ చిన్నారి తీవ్ర గాయపడింది. అత్యధిక ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి, భారీ హోంవర్క్, శారీరక శిక్షలు కార్పొరేట్ పాఠశాలల్లో సర్వసాధారణమవుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పునరావృతం కాకుండా విద్యాశాఖ(Education Department) ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
