AP | విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిన‌.. స్కూల్ అసిస్టెంట్ పై స‌స్పెన్ష‌న్ వేటు !

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా పరిధిలోని ప్యాపిలి మండలంలోని ఏనుగుమర్రి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సాంఘిక శాస్త్ర స్కూల్ అసిస్టెంట్ ఎం.బొజ్జన్న ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి.జనార్దన్ రెడ్డి తెలిపారు.

ప్యాపిలి మండలంలోని ఏనుగుమర్రి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సాంఘిక శాస్త్ర స్కూల్ అసిస్టెంట్ ఎం.బొజ్జన్న విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ప్రాథమిక విచారణలో వెళ్లడైనందున సంబంధిత ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించడమే కాకుండా విద్యార్థుల పట్ల అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించినట్లు మండల విద్యాశాఖ అధికారి, డిప్యూటీ విద్యాశాఖ అధికారి తమ నివేదికల్లో వెల్లడించినట్లు కలెక్టర్ తెలిపారు.

Leave a Reply