పరకాలలో రన్ ఫర్ జీసస్

పరకాలలో రన్ ఫర్ జీసస్

  • కార్యక్రమంలో పాల్గొన్న మడికొండ బ్రదర్స్

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. పరకాల మండల పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శనివారం రోజు ఉదయం “రన్ ఫర్ జీసస్” (ఏసుతో నడక) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కమిటీ ఎస్సీ విభాగం వైస్- చైర్మన్ డాక్టర్. మడికొండ శ్రీను, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ హాజరై క్రైస్తవ సోదర, సోదరీమణులకు “గుడ్ ఫ్రైడేష‌, “ఈస్టర్” పండుగ శుభములు, శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రధాన రహదారి ఎల్ఐసి ఆఫీస్ నుండి పరకాల ఆర్టీసీ డిపో వరకు పెద్ద ఎత్తున క్రైస్తవ సోదర, సోదరీమణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 11 వ వార్డు కౌన్సిలర్ గూడెల్లి సదన్ కుమార్, పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ఎస్ఎల్ దేవదాస్, సెక్రటరీ శ్యాంపాల్, అడ్వైజర్లు సాల్మన్, మండల వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, డేవిడ్ పాల్ , ఆర్.ఎస్ పాల్, సత్యం పాస్టర్, మహేందర్ పాస్టర్, కౌర్నీల్, కోటేశ్వర్, సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చ్ ఫాదర్ రెవరెండ్. సుధాకర్ గారు, మిషనరీ ఇంచార్జ్ రెవరెండ్. ప్రతీష్ బాబు గారు, జయరాజు, ఎలిషా, మనోహర్ పాస్టర్లు, క్రైస్తవ సోదర సోదరీమణులు, పట్టణ ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరైనారు.

Leave a Reply