RTO | ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్..

RTO | ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్..

  • కాసులు కురిపిస్తున్న ఫ్యాన్సీ నెంబర్స్‌..
  • రూ. 65 లక్షల ఆదాయం
  • అదనపు వనరుగా మారిన నెంబర్ల రాబడి
  • జోష్‌ మీదున్న రవాణాశాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సిటీలోని వాహన దారులకు ఫ్యాన్సీ నంబర్లపై రోజు రోజుకూ క్రేజ్‌ పెరుగుతోంది. ఫ్యాన్సీ నంబర్లు తెలంగాణ రవాణాశాఖకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆదాయం వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 56 రవాణా శాఖ కార్యాలయాలు ఉండగా, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనే ఫ్యాన్సీ నంబర్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే.

అయితే అందరినీ ఆశ్యర్యపరిచే విధంగా ఖైరతాబాద్‌ రవాణాశాఖ కార్యాలయానికి ఒక్కరోజులోనే రూ.65,38,889ల ఆదాయం వచ్చి నట్లు హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ కమిషనర్‌ రమేష్‌ వెల్లడించారు. అత్యధికంగా టీజీ 09 హెచ్‌ 9999 నంబరు రూ.22,72,222ల ధర పలికింది.

శుక్రవారం ఆర్టీఏ సెంట్రల్‌ జోన్‌ ఖైరతాబాద్‌లో ఫ్యాన్సీ నెంబర్ల వేలం నిర్వహించగా, రూ.65.38 లక్షల ఆదాయం వచ్చింది. టీజీ09హెచ్‌9999 నంబర్‌ను హానర్‌ ప్రైమ్‌ హౌసింగ్‌ ఎల్‌ఎల్పీ రూ.22,72,222 కు సొంతం చేసుకున్నారు. టీజీ 09జె0009 నంబర్‌ను దండు ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.6,80,000కు, టీజీ09జె0006 నంబర్‌ను సాయి సిల్క్స్‌ కళామందిర్‌ లిమిటెడ్‌ రూ.5,70,666 కు, టీజీ09జె0099 నంబర్‌ను గోదావరి ఫార్చూన్‌ రూ.3,40,000కు, టీజీ 09జె0001 నంబర్‌ను శ్రీనిధి ఐటీ స్పేసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ. 2,60,000కు, టీజీ 09జె0005 నంబర్‌ను నిహారిక ఎంటర్ టెయిన్‌మెంట్‌ సంస్థ రూ.2,40,100 కు, టీజీ09జె0018 న నంబర్ ను రోహిత్‌రెడ్డి ముత్తు రూ.1,71,189 కు, టీజీ09జె0007 నంబర్‌ ను శ్రీనివాస్‌ నాయుడు కుందవరపు రూ.1,69,002కు, టీజీ 09జె0077 నంబర్‌ను మీనాక్షీ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1,41,789కు, టీజీ 09జె0123 నంబర్‌ను ఆకుల మాధురి రూ.1,19,999కు, టీజీ 09జె0003 నంబర్‌ ను జీఎస్‌ఆర్ కన్‌స్ట్ర‌క్ష‌న్స్ రూ.1,15,121 సొంతం చేసుకున్నారు.

ఈ దఫా ఆన్‌లైన్‌ వేలంలో పలువురు సంస్థలు, వ్యా పారవేత్తలు, వ్యక్తులు తమకు నచ్చిన ప్రత్యేక వాహన నంబర్ల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారు. తాజాగా జరిగిన వేలంలో పలువురు బిడ్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఒక్క రోజులోనే ఆర్టీఏ నిర్వహించిన వేలం పాటలో 65 లక్షల 38 వేల 898 రూపాయలు ఆదాయం వచ్చింది.

ఫ్యాన్సీ వాహన నంబర్ల కోసం నిర్వహించే ఈ-వేలం ప్రతిసారి భారీ పోటీ, ఆకర్ష ణీయ బిడ్లతో కొనసాగుతూనే ఉందని ఖైరతాబాద్‌ ఆర్టీవో అధికారులు తెలిపారు. ఏడాది అక్షరాల రూ. 65.38 లక్షల ఆదాయం వచ్చినట్లు జాయింట్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ కమిషనర్‌ రమేష్‌ తెలిపారు. తెలంగాణ రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లు భారీ మొత్తంలో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ప్రతి సారీ కొత్త సిరీస్‌ మొదలైనప్పుడు.. వాహనదారులు తమ వాహనాలకు అదృష్ట సంఖ్యలు, పునరావృత సం ఖ్యలు లేదా తమకు ఇష్టమైన సంఖ్యలు దక్కించుకోడానికి పెద్ద మొత్తంలో వేలంపాటలో పాల్గొంటారు.

RTO వేలంలో కీలక విజేతలు..

ఫ్యాన్సీ నంబర్ల కోసం ప్రముఖ సంస్థలు, వ్యక్తులు పోటీపడ్డారు. ముఖ్యంగా డెవలపర్లు, ఎనర్జీ సంస్థలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలు తమ వ్యాపార వాహ నాలకు, వ్యక్తిగత వాహనాలకు ఈ ప్రత్యేక సంఖ్యలను దక్కించుకోవడానికి వెనుకాడలేదు. రవాణా శాఖకు ఈ ఫ్యాన్సీ నంబర్లు ఒక అదనపు ఆదాయ వనరుగా మారాయి. వాహనదారులు ఇంత భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. చాలా మంది సంఖ్యాశాస్త్రపరంగా కోరిన నెంబర్లను ఎంతైనా సరే వెచ్చించి మరీ దక్కించు కుంటున్నారు.

Leave a Reply