RTE-2009 | విద్యాహక్కు చట్టానికి తూట్లు…

RTE-2009 | విద్యాహక్కు చట్టానికి తూట్లు…
RTE-2009 | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : విద్యా హక్కు చట్టం (RTE-2009) యొక్క అసలు ఆశయానికి, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు మధ్య ఉన్న అంతరాన్ని విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును బలహీనపరిచేలా ఉందని వాపోతున్నారు. ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో పేద వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించాలి. ప్రైవేట్ పాఠశాలలు కేటాయించిన చట్టం అమలు కావట్లేదు అనేది వాస్తవ పరిస్థితులకు దారి తీసింది. గత ప్రభుత్వంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని అమలు చేస్తూ జీవో జారీ చేశారు సచివాలయాల ద్వారా అర్జీలు స్వీకరించి విద్యార్థులను ఎంపిక చేశారు. మొక్కుబడిగా ఆ ఒక్క సంవత్సరమే ఫీజు రాయితీ కల్పించారు.
పాఠశాల యాజమాన్యంతో సమావేశాలు నిర్వహించి విద్యాహక్కు చట్టం కింద 2020 సంవత్సరం నుండి అమలు చేయాలని వారికి విద్యను పూర్తిగా ఉచితంగా అందించడం ద్వారా ఆ నగదును స్కూల్లో హెడ్మాస్టర్ ఖాతాకు జమ చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఒక్క సంవత్సరం కూడా డబ్బులు జమ చేయలేదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్లు పొందిన ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేలు వేలు పెట్టి పుస్తకాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ముందు ఫీజులు కట్టండి ప్రభుత్వం నగదు బదిలీ చేసిన వెంటనే మీకు ఫీజు వాపసు ఇవ్వటం జరుగుతుందని విద్యాసంస్థల యాజమాన్యం తల్లిదండ్రులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను ఉద్ధరిస్తున్నాం అన్న ధోరణిలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రభుత్వం సంబంధిత విద్యార్థి తల్లిదండ్రులకు చరవాణి ద్వారా సంప్రదించి వివరాలు సేకరించిన ఇప్పటివరకు ఎటువంటి నగదు బదిలీ జరగలేదు. ఈ విషయమై ప్రభుత్వం తక్షణ స్పందించి పేద విద్యార్థులకు భరోసా కల్పించాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
