Rs.13 lakhs | అదే ప్రభుత్వ లక్ష్యం..

Rs.13 lakhs | అదే ప్రభుత్వ లక్ష్యం..
- మౌళిక వసతులు కల్పించి..
- ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం
- 13 లక్షల రూపాయలతో..
Rs.13 lakhs | అనంతపురం ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. గ్రామాల్లో మౌళిక సదుపాయలు కల్పించడం పై ప్రత్యేక శ్రద్థ తీసుకుంటున్నారు. సీసీ రోడ్లు, తాగునీరు, వీధి బల్బులు, పారిశుధ్యమే లక్ష్యంగా పని చేస్తున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు.
ఈ రోజు శెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో రూ.13 లక్షల(Rs.13 lakhs) వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక సర్పంచ్ అనురాధ ధనుంజయ, టీడీపీ సీనియర్ నాయకులు, అధికారులతో కలసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
Rs.13 lakhs | నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే(MLA) మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌళిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నారని, అందులో భాగంగానే ప్రతి గ్రామంలోను సీసీ రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధిలో మరింత వెనుకబడిపోయాయని, కనీసం గ్రామాలకు రహదారులు నిర్మించకుండా వదిలేశారని వాటిని మంజూరు చేయించి రోడ్లు వేయిస్తామని అన్నారు.
