ప్రయాణికులకు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి

ప్రయాణికులకు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి
- ఆర్ పి ఎఫ్ సీఐ శ్రీనివాస్ గౌడ్
కరీమాబాద్, ఆంధ్రప్రభ ; వరంగల్ రైల్వేస్టేషన్లోని అన్ని స్టాల్స్ వెండర్స్ కు ఆర్పిఎఫ్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. శుక్రవారం ఆర్పిఎఫ్ కార్యాలానికి ఆర్ పి ఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రయాణికునికులతో మర్యాదగా మాట్లాడాలని, ఏ వస్తువులు అమ్మిన ఎమ్మార్పీ రేట్ లోనే విక్రయించాలని అంతకంటే ఎక్కువగా విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
రైల్వే ప్రయాణికులతో సత్ప్రవర్తనగా మెదులుకోవాలని ట్రైన్లో లోపలికి వెళ్ళకూడదని ట్రైన్లలో రన్నింగ్ ట్రైన్ లో దిగకూడదని వారికి సూచించారు.కౌన్సిలింగ్లో ఎస్సై జివెంకటేశ్వర్లు ,ఏఎస్ఐ సిబ్బంది, స్టాల్స్ యజమానులు పాల్గొన్నారు.
