Road accident | ఘోర రోడ్డు ప్రమాదం….

Road accident | ఘోర రోడ్డు ప్రమాదం….

  • ఆటోను ఢీ కొట్టిన ట్రాక్టర్…
  • అక్కడికక్కడే భార్య మృతి…
  • ఆస్పత్రికి తరలిస్తుండగా భర్త మృతి…
  • పలువురికి తీవ్ర గాయాలు….
  • మృతి చెందిన భార్యాభర్తలు బస్వాపూర్ వాసులు…..
  • గ్రామంలో విషాదఛాయలు….
  • మానవత్వం చాటుకున్న మెదక్ అడిషనల్ ఎస్పీ…

Road accident | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు మృతిచెందగా అదే కుటుంబానికి చెందిన పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి .

మెదక్ జిల్లా రామాయంపేట పోలీసులు, బస్వాపూర్ గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పూసల బాలరాజు వారసంతలలో మిర్చి బజ్జీలు వేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులతో ఆటోలో మెదక్ జిల్లా అవుసులపల్లికి వెళ్తున్నారు. రామాయంపేట, అక్కన్నపేట గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఆటోను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న పూసల మంజుల(30) అక్కడికక్కడే మృతి చెందారు.

Road accident |

తీవ్రంగా గాయపడిన పూసల బాలరాజ్ తో పాటు వారి కుటుంబ సభ్యులను రామాయంపేట ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలిస్తుండగా బాలరాజు మార్గమధ్యంలో మృతి చెందారు. మిగతావారు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. మెదక్ నుండి రామాయంపేట వస్తున్న మెదక్ అడిషనల్ ఎస్పీ మహేందర్ రోడ్డు ప్రమాద సంఘటనను కనులారా చూసి మానవత్వాన్ని చాటుకున్నారు. వెంటనే తన వాహనంలో నుండి దిగి వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు తగు చర్యలు తీసుకున్నారు.

అంతే కాకుండా వైద్యులకు ఫోన్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. విషయం తెలుసుకున్న బంధువులు బస్వాపూర్ గ్రామస్తులు పెద్ద ఎత్తున రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలి వెళ్లారు. అక్కడ శోకసముద్రంగా ఆస్పత్రి మారింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సైతం గాయపడ్డారు. వారికి ప్రస్తుతం వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ మేరకు రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply