Returning |మున్సిపల్ ఎన్నికలపై ఆర్ ఓ, ఏఆర్ ఓలకు శిక్షణ

Returning |మున్సిపల్ ఎన్నికలపై ఆర్ ఓ, ఏఆర్ ఓలకు శిక్షణ

Returning | మోత్కూర్, ఆంధ్రప్రభ : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కార్యాలయములో ఈ రోజు మున్సిపల్ కమిషనర్ కె. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు, ఎఫ్ ఎస్ టీ, ఎస్ ఎస్ టీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ఇ తర అధికారులకు జిల్లా మాస్టర్ ట్రైనర్ లు ముత్యం అశోక్, సి హెచ్ చిత్తరంజన్ లు ఎన్నికల విధులు, నియమ నిబంధనలు, పోలింగ్, కౌంటింగ్, పోలింగ్ సామగ్రి తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు కమిషనర్ కె. సతీష్ కుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply