Award | బంజారా సాహిత్య జ్ఞానరత్న అవార్డు ప్రదానం…

Award | బంజారా సాహిత్య జ్ఞానరత్న అవార్డు ప్రదానం…
Award | ఉట్నూర్, ఆంధ్రప్రభ : కవన కోకిల ఉసా వే ఉట్నూర్ అధ్యక్షుడు బంకట్ లాల్ జాదవ్ కు శ్రీ సేవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బంజారా సాహిత్య జ్ఞాన రత్న అవార్డు 2026 అందుకున్నారు. అవార్డు గ్రహీత బంకట్ లాల్ జాదవ్ కు ఇవాళ సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ ఆశ్రమొన్నత పాఠశాలలో శ్రీ సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ జాదవ్ వసంత రావు, వైస్ చైర్మన్ చవాన్ సేవా దాస్ చేతుల మీదుగా అవార్డు అందించడంతోపాటు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్. చైర్మన్ మాట్లాడుతూ.. పుస్తకాలు రాసి ప్రపంచానికి తెలియ జేస్తూ, పాటల రూపంలో ప్రజలకు చైతన్య పరుస్తూన్నా బంకట్ లాల్ కి శ్రీ సేవా ఫౌండేషన్ తరుపున బంజారా సాహిత్య జ్ఞాన రత్న అవార్డు అందిస్తున్నమన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాథోడ్ బలిరామ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారని అవార్డు గ్రహీత బంకట్ లాల్ జాదవ్ తెలిపారు.
