Retirement | బకాయిలు ఏకమొత్తంలో చెల్లించాలి

Retirement | బకాయిలు ఏకమొత్తంలో చెల్లించాలి

  • కలెక్టరేట్ ఎదుట పెన్షన్ దారుల నిరాహార దీక్ష

Retirement | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఉద్యోగ విరమణ పొందిన వారికి ఇవ్వాల్సిన రిటైర్ మెంట్ బకాయిలు(Retirement arrears) ఏకమొత్తంగా చెల్లించాలని తెలంగాణ రిటైర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు.

ఈమేరకు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఇవాళ‌ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. దశాబ్దాల పాటు ప్రభుత్వానికి, ప్రజలకు వార‌ధిగా సేవచేసి రిటైర్ అయిన తరువాత పొదుపు డబ్బులు అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని పెన్షనర్లు(pensioners) ఆవేదన వ్యక్తం చేశారు.

2024 నుండి నేటి వరకు రాష్ట్రంలో దాదాపు 16 వేల మంది ఉద్యోగ, ఉపాద్యాయులు పదవీ విరమణ పొందగా, ఇప్పటివరకు రిటైర్ మెంట్ బకాయిలు రాలేదని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం(government) వాయిదాలు కాకుండా ఒకేసారి రిటైర్ మెంట్ బకాయిలు ఇవ్వాలని నినాదాలు చేశారు.

అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రిటైర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply