బెల్లంపల్లి, ఫిబ్రవరి 16, (ఆంధ్రప్రభ) చలో ఆర్ఎంపి.. చలో హైదరాబాద్ అనుభవ వైద్యుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని జిల్లా అనుభవ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల రవి అన్నారు. ఆదివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో చలో ఆర్.ఎం.పి… హలో హైదరాబాద్ అనుభవా వైద్యుల ఆత్మగౌరవ సభ పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆర్ఎంపి, పిఎంపీలకు శిక్షణ ఇచ్చి గుర్తింపు కోసం సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. కానీ ఎక్కడ చూసినా ఆర్ఎంపి, పీఎంపీ ల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయని వాటిని అరికట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మమ్మల్ని ఆదుకోవాలని కోరారు.
ఆర్.ఎం.పి పి.ఎం.పి ల కోసం ప్రభుత్వం కృషి చేయాలని ఈనెల 18న జరగబోయే అనుభవ వైద్యుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయడానికి జిల్లా నలుమూలల నుండి ఆర్ఎంపీలు, పీఎంపీలు తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్ఎంపీల సంఘం అధ్యక్షుడు దశరథం, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ చారి, సీనియర్ వైద్యులు బ్రహ్మానందం, సంఘం నాయకులు పోలు శ్రీనివాస్, ఏం శ్రీనివాస్, కె భూపతి రాజు, జే బానేష్, పి కనకయ్య, జి రాజేష్ ఎం తదితరులు పాల్గొన్నారు.