పోలీసులను పరామర్శించిన ఎమ్మెల్యే..

పోలీసులను పరామర్శించిన ఎమ్మెల్యే..
- చల్లపల్లి పోలీస్ స్టేషన్ ను పరిశీలన
చల్లపల్లి – ఆంధ్రప్రభ : చల్లపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన పేలుళ్ల సంఘటనపై ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ స్పందించారు. మంగళవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ సందర్శించి పోలీసులు అడిగి వివరాలు తెలుసుకున్నారు. పేలుడు ఘటన జరగడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ తేజను, కానిస్టేబుల్ పార్వతిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. విజయవాడ తరలించిన ముగ్గురు పోలీసుల గురించి స్థానిక పోలీసులు అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో జరిగిన పరిస్థితిని ఆయన పరిశీలించారు.
