Police Case | నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన..

Police Case | నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన..
Police Case | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఓ మీడియా కార్యాలయం ఎదుట నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన నిర్వహించినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో అంబటి రాంబాబుతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలపైనా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. అనుమతులు లేకుండా ఆందోళన చేపట్టడం, ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

