police | 32 కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని…

police | 32 కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని…
police | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మచిలీపట్నం గిలకలదిండి ప్రాంతంలో కుద్రపూజలు కలకలం రేపాయి. ఊరి మధ్యలో అనుమానాస్పదంగా పూజలు నిర్వహించడం, చేతబడి వదంతులు వ్యాపించడంతో గ్రామస్తుల్లో భయం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం సమీపంలోని గిలకలదిండి ప్రాంతంలో అనుమానాస్పద కుద్రపూజలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఊరి నడిబొడ్డున పసుపు, కుంకుమ, గుడ్డతో చేసిన బొమ్మ, నిమ్మకాయలతో ముగ్గు వేసి పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించాయి.
ఈ ఘటనను తెల్లవారు జామున గ్రామస్తులు గమనించి ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ పూజలు గ్రామంలోని 32 కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని చేతబడి చేశారనే వదంతులు వేగంగా వ్యాపించాయి. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామస్తులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
