ఈరోజు ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ తో జరుగుతన్న మ్యాచ్ లో బెంగళూరు జట్టు బాదేస్తుంది. 158 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన ఆర్సీబీ తొలి ఒవర్లోనే కీలక వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (1) ఔటయ్యాడు.
అయితే, ఆ ఎదురుదెబ్బకు ఏమాత్రం ప్రభావితం కాకుండ ఆర్సీబీ బ్యార్లు పవర్ ప్లేలో పంజాబ్ బౌలర్లపై బలమైన పోరాటాన్ని ప్రదర్శిస్తున్నారు.
వన్ డౌన్ లో వచ్చిన దేవదత్ పడిక్కల్ (22) తో జతకట్టిన విరాట్ కోహ్లీ (31)… 6 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు బోర్డుకు 54 పరుగులు జోడించాడు. వీరిద్దరూ కలిసి 6 ఓవర్లలో రెండో వికెట్ కు 30 బంతుల్లో 48 పరుగులు జోడించారు.