Passengers | కండక్టర్‌ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

Passengers | కండక్టర్‌ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

Passengers | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : మహాత్మ గాంధీ బస్ స్టేషన్ లో ఇవాళ ఒక్కసారిగా కలకలం రేగింది. గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ప్లాట్‌ఫాంపై నిలిపి ఉన్న బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో వెంటనే మంటలు వ్యాపించాయి. ఘటనను గమనించిన బస్సు కండక్టర్ చాకచక్యంగా స్పందించి నీటితో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

అదృష్టవశాత్తు ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మెయింటెనెన్స్ లోపమా? లేక ఇతర సాంకేతిక కారణాల వల్ల మంటలు చెలరేగాయా? అనే అంశాలపై దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply