BJP Office | హైదరాబాద్‌లో ఘనంగా వేడుకలు..

BJP Office | హైదరాబాద్‌లో ఘనంగా వేడుకలు..

చంద్రబాబు శుభాకాంక్షలు

Party Office | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ జెండాను ఎగరవేశారు.

ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలపై నాయకులు మాట్లాడారు.

ఇదిలా ఉండగా, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని బీజేపీ మరింత బలంగా నిలిపిందని పేర్కొంటూ, అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి కొనసాగాలని ఆకాంక్షించారు.

Leave a Reply