Panchayati Raj | గ్రామీణాభివృద్ధిలో అగ్రస్థానం

Panchayati Raj | గ్రామీణాభివృద్ధిలో అగ్రస్థానం

Panchayati Raj | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరిచి ఐదు ప్రతిష్టాత్మక అవార్డులను సాధించింది.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మొత్తం ఐదు అవార్డులను రాష్ట్రం దక్కించుకోవడం విశేషం. ఇందులో రెండు విభాగాల్లో ప్రథమ స్థానం, ఒక విభాగంలో ద్వితీయ స్థానం, మరో రెండు విభాగాల్లో తృతీయ స్థానాలు లభించాయి.

రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్, జల్ సంచయ్-జన్ భాగీదారి వంటి కీలక విభాగాల్లో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గ్రామీణాభివృద్ధి, నీటి సంరక్షణలో చేపట్టిన కార్యక్రమాలకు ఈ అవార్డులు దక్కినట్లు అధికారులు తెలిపారు. గతంలో 24వ స్థానంలో ఉన్న ఈ శాఖ, ఇప్పుడు దేశంలోనే ముందంజలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది.

Leave a Reply