తొర్రూరులో పాంచజన్య స్కిన్, హెయిర్ క్లినిక్ ప్రారంభం

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : దినదినాభివృద్ధి చెందుతున్న తొర్రూరు పట్టణంలో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం డాక్టర్ బి. వేద కిరణ్ ఏర్పాటు చేసిన పాంచజన్య స్కిన్, హెయిర్ అండ్ పాలీ క్లినిక్ సెంటర్ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.
ఈ క్లినిక్ ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన చర్మం, జుట్టు సంబంధిత వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. క్లినిక్ నిర్వాహకులను అభినందిస్తూ, ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే సేవలను నిరంతరం అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
