Pamphlets | 34వ జాతీయ నాస్తిక మేళా కరపత్రాల ఆవిష్కరణ

Pamphlets | 34వ జాతీయ నాస్తిక మేళా కరపత్రాల ఆవిష్కరణ

Pamphlets | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పారద్రోలి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నాస్తిక మేళాలు కృషి చేస్తున్నాయని పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన వేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలోని మహనీయుల విగ్రహాల ప్రాంగణంలో 34వ జాతీయ నాస్తిక మేళా కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గొడిసెల శ్రీహరి మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులోని చార్వాకాశ్రమంలో ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి నాస్తిక మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా ఉన్న హేతువాదులు, మేధావులు, సామాజిక విశ్లేషకులు ఈ మేళాకు హాజరై ప్రస్తుత సామాజిక పరిస్థితులపై చర్చించనున్నారని వివరించారు. ఈ మేళాకు బెల్లంపల్లి ప్రాంతం నుండి కూడా ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెరియార్ అంబేద్కర్ ఆలోచన వేదిక ఉపాధ్యక్షుడు అక్కు ఉమ, వర్కింగ్ ప్రెసిడెంట్ గొడిసెల సామి, కార్యదర్శులు అక్కు కృష్ణ, గొడిసెల చంద్రమౌళి, ప్రచార కార్యదర్శి జంజార్ల రవిరాజ్, ఉపాధ్యక్షుడు దుబాశి రవి, సంయుక్త కార్యదర్శి ఉండ్రాళ రవి, సలహాదారులు రసకొండ ప్రసాద్, రాజేందర్, జ్యోతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply