150కి పైగా నామినేష‌న్లు…

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు ఈ రోజు ముగిసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయ‌ని స‌మాచారం. ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. ఈ రోజు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి త‌న నామినేషన్ దాఖలు చేశారు.

ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు, రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) బాధిత రైతులు, ఓయూ నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. మూడు గంటల తర్వాత నుంచి గేటు లోపల ఉన్నవారికే నామినేషన్ వేసేందుకు అనుమ‌తించారు. దాఖలైన నామినేషన్లను రేపటి నుంచి ఆర్వో సాయిరాం పరిశీలించనున్నారు. అక్టోబర్ 24 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు ఉంది.

Leave a Reply