DRUNK | డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి జైలు శిక్ష..
DRUNK | బిక్కనూర్, ఆంధ్రప్రభ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి జైలు శిక్ష విధించడం జరిగిందని బిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రంలో పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) నిర్వహించడం జరిగిందన్నారు. మండల కేంద్రానికి చెందిన వెంకటేశ్వర్లు మద్యం తాగి వాహనం నడిపినట్లు తెలిపారు. ఆయనపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందన్నారు. కామారెడ్డి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ ఆయనకు వెయ్యి రూపాయల జరిమానాతో పాటు ఒకరోజు జైలు శిక్ష విధించడం జరిగిందని వివరించారు. మద్యం సేవించి ఎవరు వాహనాలు నడిపినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

