సత్యసాయి శత జయంతికి

  • ముందస్తు సన్నాహాలు
  • పలు ప్రాంతాల్లో కలెక్టర్, ఎస్పీ సందర్శన
  • మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరు
  • ట్రస్టు సభ్యులతో చర్చలు

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భగవాన్ శ్రీ సత్య సాయి బాబాSri Sathya Sai Baba) శతజయంతి ఉత్సవాలకు ముందస్తు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలు పుట్టపర్తి(Puttaparthi)లోని పలు ప్రాంతాలను పర్యవేక్షించారు.

ముఖ్యంగా సాయిబాబా ట్రస్ట్ సభ్యులచే చర్చలు జరిపి అధికారికంగా అదేవిధంగా పోలీస్ శాఖ(Police Department) పరంగా తీసుకోవలసిన చర్యలు గురించి లోతుగా మాట్లాడారు. నవంబర్ 23వ తేదీన బాబా శత జయంతి సందర్భంగా ముందుగానే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం(State Government) అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేక దృష్టి పెట్టి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి(Palle Raghunath Reddy)తో పాటు ట్రస్టు సభ్యులతో కలసి ఏర్పాట్లపై సమీక్షించడం జరుగుతోంది. ఇప్పటికే ఒక ప్రైవేట్ సంస్థ సహకారంతో కోటి 25 లక్షల ఆర్థిక సాయంతో చిత్రావతి నదికి అనుకొని సుందరమైన పార్కు నిర్మాణం చేపట్టారు.

అంతేకాకుండా రోడ్ల మరమ్మతులు, వివిధ దేశాల నుంచి వచ్చే భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై ముందస్తుగానే అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎక్కడా కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా శత జయంతి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కావున ట్రస్ట్(Trust) సభ్యుల సూచనలు సలహాలతో ఇందుకు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్(Shyam Prasad) తెలిపారు.

Leave a Reply