nomination | ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు

nomination | ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు
nomination | రెంజల్, ఆంధ్రప్రభ : రెంజల్ మండలంలోని సాటాపూర్ కేంద్రంలో ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేశారు. బోర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి కార్తిక్ యాదవ్(Jyoti Kartik Yadav), సాటాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి లచ్చవార్ సువాసిని నితిన్, తాడ్ బిలోలిలో కాంగ్రెస్ అభ్యర్థి యోగేష్ పటేల్ నామినేషన్ దాఖలు(nomination) చేశారు. తమ నామినేషన్ పత్రాలను అధికారులకు ఇచ్చారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం నాగభూషణం రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నందకుమార్, గంగాధర్ గౌడ్, సీపీఎంఎల్ మండల అధ్యక్షుడు ఓడ్డెన్న, మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
