Nizambad | డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటాం..

Nizambad | డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటాం..
22వ డివిజన్ బిజెపి అభ్యర్థి పులగం వైష్ణవి సుధా..
Nizambad, ఆంధ్రప్రభ : నిజాంబాద్ నగరంలోని 22వ డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటానని 22వ డివిజన్ బిజెపి అభ్యర్థి పులగం వైష్ణవి సుధా అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 22వ డివిజన్ బిజెపి అభ్యర్థి పులగం వైష్ణవి సుధా భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఈ సందర్భంగా పులగం వైష్ణవి మాట్లాడుతూ.. డివిజన్ ప్రజల నుంచి పూర్తి మద్దతు ఆశీర్వాదం మా పై ఉండడంతోనే విజయం సాధించామని అన్నారు. డివిజన్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రత్యేక కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
