దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ జారీ
అన్ని ఎయిర్‌పోర్టులు, సీపోర్టులకు పోలీసుల సమాచారం
ఇప్పటికే కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ డ్
పోలీసులు మూడుసార్లు నోటీసులిచ్చినా విచారణకు రాని కాకాణి
12 రోజులుగా పరారీలోనే కాకాణి, మరో నలుగురు నిందితులు
కాకాణితో పాటు మిగిలిన నిందితుల కోసం పోలీసుల ముమ్మర గాలింపు
ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో రంగంలోకి దిగిన 6 పోలీసు బృందాలు
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగంపై ఆరా
క్వార్ట్జ్ అక్రమ రవాణాపై ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డిపై ఇప్పటికే 3 కేసులు నమోదు
కాకాణిపై క్వార్ట్జ్ అక్రమ తరలింపు, అట్రాసిటీ కేసు, పోలీసులను దూషించిన కేసు
విదేశాలకు రూ.250 కోట్లకుపైగా విలువచేసే క్వార్ట్జ్ ఎగుమతి చేసిన కాకాణి, అనుచరులు
విదేశాల నుంచి పెద్దమొత్తాల్లో నగదు బదిలీపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్న పోలీసులు
పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కంపెనీలు, కొన్న వ్యక్తులు, వినియోగంపైనా దర్యాప్తు
నెల్లూరు – క్వారీలో అక్రవ తవ్వకాలలో కేసులో .వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు.. ఆరు బృందాలతో తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు.. కాకాణిపై నమోదైన కేసుల విషయంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో అప్రమత్తమైన పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి విదేశాలకు వెళ్లకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ మరోవైపు ముందస్తు బెయిల్ కోసం కాకాణి దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన విషయం విదితమే.. కాకాణి వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.. ఈ నేపథ్యంలో కాకాణి గోవర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగా ఆయనపై లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు..
కాగా, పోలీసులు నోటీసులు జారీ చేసిన.. విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొడుతూ వచ్చారు కాకాణి.. నెల్లూరులో ఆయన అందుబాటులో లేకపోవడంతో.. మొదట ఆయన ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లిన పోలీసులు.. ఆ తర్వాత హైదరాబాద్‌లోనైనా నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు.. అక్కడ కూడా సాధ్యం కాకపోవడంతో.. కాకాణి కుటుంబ సభ్యులకు నోటీసులు అందించారు.. అయితే, కాకాణి మాత్రం పోలీసుల విచారణకు హాజరుకాకపోవడం.. మరోవైపు.. హైకోర్టులో కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగలడంతో.. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు.. ఇప్పటికే మూడు నోటీస్ లు ఇచ్చినా విచారణకు హాజరుకాకపోవడంతో గోవర్దన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నాయి..