- బౌలర్లను బాదేస్తున్న ఓపెనర్లు
కటక్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా హిట్ మ్యాన్, కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న రోహిత్ ఈ మ్యాచ్‌లో.. అదిరే హాఫ్ సెంచరీతో పునరాగమనం చేశాడు. 30 బంతుల్లో 50 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు.
ఇంగ్లండ్ నిర్దేశించిన 305 పరుగుల భారీ లక్ష్యంలో.. సుభమన్ గిల్ తో కలిసి బలమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. రోహిత్.. శుభమన్ గిల్ వికెట్ కోల్పోకుండా 13.3 ఓవర్లకు ఇండియా స్కోర్ 100 దాటించారు. మరో ఎండ్‌లో శుభమాన్ గిల్ కూడా బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. 45 బంతుల్లో 50 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ప్రస్తుతం టీమిండియ స్కోర్ – 16/127
రోహిత్ 73(48)
శుభమన్ గిల్ 52(48)
