Negligence of doctors | చిమ్మచిక్కట్లో రోగికి కుట్లు

Negligence of doctors | చిమ్మచిక్కట్లో రోగికి కుట్లు
- ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో డాక్టర్ల నిర్వాహకం
- ఆందోళనలో రోగులు
Negligence of doctors | నర్సంపేట క్రైమ్, ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త సంవత్సరం ప్రారంభం రోజున జరిగిన సంఘటన రోగులను ఆందోళనకు గురిచేస్తుంది. వివరాల్లోకి వెళ్తే…. నెక్కొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి తలకు గాయం కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
ఈ క్రమంలో డాక్టర్లు చికిత్స చేస్తున్న సమయంలో కరెంటు పోవడం జరిగింది. జనరేటర్ వేయకుండా ఆస్పత్రి సిబ్బంది సెల్ఫోన్ లైట్ల వెలుతురుతోనే ఆ వ్యక్తి తలకు కుట్లు వేయడం జరిగింది. రోగి సహాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జనరేటర్ వేయడంలో నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.
