Nayanatara | రేటు బాగా పెంచేసిందా..?

Nayanatara | రేటు బాగా పెంచేసిందా..?

Nayanatara | బాలీవుడ్‌లో నయనతార క్రేజ్ పెరుగుదల
సల్మాన్ ఖాన్ మూవీతో భారీ అవకాశం
రెమ్యూనరేషన్ పెంపు వెనుక కారణాలు
లాభాల్లో వాటా డీల్ ఎలా పని చేస్తుంది?
నయనతార నిర్ణయం ఇండస్ట్రీపై ప్రభావం

Nayanatara | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : లేడీ సూపర్ స్టార్ నయనతార.. ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ.. మరో వైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటిస్తూ.. కెరీర్ లో దూసుకెళుతుంది. అలాగే నిర్మాణ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చి.. వరుసగా సినిమాలు (Movies) చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు రేటు విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది. ఈమధ్య రెమ్యూనరేషన్ ఇంకా పెంచిందట. ఇప్పుడు ఓ భారీ, క్రేజీ మూవీ కోసం రెమ్యూనరేషన్ విషయంలో రూటు మార్చిందట. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. నయన్ రేటు ఎంత..? రూటు మార్చి ఏం చేయనుంది..?

Nayanatara

Nayanatara | నయన్ కు బాలీవుడ్ లో క్రేజ్..

నయన తార.. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో నయన్ కు బాలీవుడ్ లో కూడా క్రేజ్ పెరిగింది. ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salmankhan) కు జంటగా నటించబోతుందని తెలిసింది. ఈ మూవీని టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నారు. ఈ భారీ, క్రేజీ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే.. ఈ సినిమాలో పాత్ర కోసం నయనతారే కావాలని.. ఆమె అయితే.. ఆ పాత్రకు పర్ ఫెక్ట్ అనేట్టుగా ఉంటుందని వంశీ పైడిపల్లి దిల్ రాజు చెప్పారట.

Nayanatara

Nayanatara | నయన్.. బాగా పెంచేసిందా..?

అయితే.. దిల్ రాజు టీమ్.. నయన్ ని కాంటాక్ట్ చేస్తే.. రెమ్యూనరేషన్ భారీగా చెప్పారట. నయనతార ఒక్కో సినిమాకి 5 కోట్లు నుంచి 10 కోట్లు వరకు తీసుకుంటుందని టాక్ (Talk) వినిపిస్తోంది. అయితే.. ఈ సినిమా కోసం ఇంకాస్త పెంచి చెప్పారట. అంత పెద్ద అమౌంట్ ఇచ్చి రిస్క్ తీసుకోవడం కంటే.. సినిమా బిజినెస్ లాభాల్లో వాటా ఇవ్వడమే మంచిదని నిర్మాత దిల్ రాజు భావించారట. ఇలా చేయడం వలన ఆమె అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు అవుతుంది.. నిర్మాతకు ఆర్ధిక వెసులుబాటు ఉంటుంది. దీనికి నయన్ కూడా ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది.

Nayanatara

Nayanatara | నయనతారకు కూడా..

ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. సాధారణంగా.. హీరోలకు సినిమా లాభాల్లో వాటా ఇస్తుంటారు. అలాంటిది నయనతారకు కూడా లాభాల్లో వాటా ఇవ్వడం అంటే.. ఆమెకు ఎంత క్రేజ్ (Crage) ఉందో అర్ధమౌతుంది. సల్మాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు.. ఈ సినిమాతో నయన్ చేస్తున్న ప్రయోగం సక్సెస్ అయితే.. మరి కొంత మంది హీరోయిన్స్ ఈ రూటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే.. అందరి హీరోయిన్స్ కు నిర్మాత లాభాల్లో వాటా ఇవ్వరు. నయన్ రేంజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్స్ విషయంలో అయితే.. నిర్మాతలు లాభాల్లో వాటాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారు. మరి.. నయన్ స్పూర్తితో మరి కొంత మంది హీరోయిన్స్ ఇలా చేస్తారేమో చూడాలి.

Nayanatara

Leave a Reply