విదేశాలకు ఆదర్శం

జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్


శ్రీ సత్యసాయి బ్యూరో, అక్టోబర్ 15 (ఆంధ్రప్రభ) : శ్రీ సత్య సాయి జిల్లా (Sri Sathya Sai district) రైతు సాధికార సంస్థ ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ( ఏపీసీఎన్ఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న పకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు భారతదేశంలోని జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకేర్మాన్ బుధవారం శ్రీ సత్య సాయి జిల్లా, వైయస్సార్ కడప జిల్లాలో క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయంపై పర్యటన కు వచ్చారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన పుట్టపర్తి మండలం పెడబల్లి గ్రామానికి విచ్చేశారు. ఆయన వెంట బి. రాజశేఖర్ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఏపీ ప్రభుత్వం, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఉన్నారు.

ఈసందర్భంగా డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్, జర్మన్ అంబాసిడర్ బృందం (German Ambassador’s Team) పెడబల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తూ విజయబాయి, సుధాకర్,ఆంజనేయులు నాయక్ తమ పొలాల్లో సాగు చేస్తున్న వరి వేరుశనగ పీఎండీఎస్ పంటలను సందర్శించి వారు వినియోగిస్తున్న ఇన్పుట్స్ ( బీజామృతం ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, విత్తన గుళికల తయారీ ) విధానాలలో రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయం అమలు అవుతున్న విధానాలను బయో రీసెర్చ్ సెంటర్ ను సందర్శించి ప్రకృతి వ్యవసాయ విధానాలు నేర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారి వి. లక్ష్మ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply