కాణిపాకం దేవస్థానంలో నారా రోహిత్ దంపతులు..

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో శనివారం సినీ నటుడు, మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు నారా రామమూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా వారికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్. స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఏఈఓ రవీంద్రబాబు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, శ్రీ స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటంలను నారా రోహిత్ దంపతులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ చిట్టిబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply