Nandigama Election | నందిగామ అంటేనే.. నాణ్యతకు చిరునామా..

Nandigama Election | నందిగామ అంటేనే.. నాణ్యతకు చిరునామా..

  • గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం
  • ఆదరించి ఆశీర్వదించండి..
  • బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కొమ్ము వెంకటయ్యను అధిక మెజారిటీతో గెలిపించండి..
  • బీఆర్ఎస్ నేతలు జిల్లెల్ల వెంకట్ రెడ్డి, ఈట గణేష్

Nandigama Election | నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామ అంటేనే నాణ్యతకు చిరునామాగా మార్చి ఎన్నో అభివృద్ధి పనులను చేసి చూపెట్టామని.. మాజీ సర్పంచ్ జిల్లెల్ల వెంకట్ రెడ్డి అన్నారు. ఇప్పుడు జరుగుతున్న నందిగామ గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో షాద్ నగర్(Shad Nagar) మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆశీస్సులతో బీఆర్ఎస్ ప్యానల్ అభ్యర్థి కొమ్ము వెంకటయ్య(Venkataiah the horn) బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించుకొని గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కొమ్ము వెంకటయ్య తెలుపుతూ… మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సహకారంతో మాజీ సర్పంచ్ జిల్లెల్ల వెంకట్ రెడ్డి, మాజీ జడ్పివైస్ చైర్మన్ ఈట గణేష్ కృషితో గ్రామాన్ని అన్ని విధాలుగా హైటెక్ అంగులతో(With high-tech fingers) ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపెట్టామన్నారు. ఇక సర్పంచ్ గా నన్ను గెలిపిస్తే నందిగామను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లి మరింత అభివృద్ధి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆయన స్పష్టం(He is clear) చేశారు. నాకు ధైర్యం.. అండ దండలుగా ఉన్న గ్రామ ప్రజలు, బీఆర్ఎస్ సీనియర్ నేతలు మాజీ సర్పంచ్ జిల్లెల వెంకటరెడ్డి, మాజీ జెడ్పిటిసి చైర్మన్ ఈట గణేష్, మాజీ ఏఎంసీ చైర్మన్ వి, నారాయణరెడ్డి ఆశీస్సులతో సర్పంచ్ బరి(Sarpanch Bari)లో నిలబడ్డానన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి…గ్రామాన్ని మరింత అభివృద్ధితో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన ప్రజలను కోరారు.

నందిగామ ప్రజలే నా గెలుపుకు పునాదులు
సీనియర్ నాయకులు జిల్లెల్ల వెంకట్ రెడ్డి,ఈట గణేష్
నన్ను ఎంతో ఆదరించడంతో పాటు, ముఖ్యంగా అండగా నిలబడ్డ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిల్లెల్ల వెంకటరెడ్డి..మాజీ జడ్పివైస్ చైర్మన్ ఈట గణేష్ నందిగామ గ్రామ ప్రజలు రాబోయే తన గెలుపునకు(To his upcoming victory) ముఖ్యులుగా నిలుస్తారని తెలిపారు. తనకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి.. అభివృద్ధికి తోడునీడగా సహకారం అందించిన బీఆర్ఎస్ నాయకులకు, శ్రేణులకు, గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.

గత పదేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో..
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కృషితో మండలంలోని అన్ని గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు.
ఆనాడు నందిగామ పెద్ద గ్రామంగా పిలువబడిన గ్రామాన్ని పట్టించుకునే బడానేతలు కరువుండే అని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెరాస ప్రభుత్వ(Terasa Govt) పాలనలో ఎమ్మెల్యే అంజయ్య నందిగామను గుర్తించి మండలంగా ఏర్పాటు చేయడం గ్రామ అభివృద్ధికి తొలి మెట్టుగా మారిందన్నారు. నందిగామ గ్రామంలో నాణ్యతతో కూడిన వెడల్పు రోడ్ల నిర్మాణం(Construction of wide roads), ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా, పురవీధుల గుండా అండర్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు కొత్తూర్ నుండి షాద్ నగర్ పట్టణం వరకు నాలుగు లైన్ల బీటీ రోడు నిర్మాణం, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసి అభివృద్ధికి మారుపేరుగా నిలిచామన్నారు.

గ్రామంలో సమస్యాత్మకంగా ఉన్న విద్యుత్ సమస్య పరిష్కరించేందుకు, గ్రామ పరిధిలోని డీఎల్ఎఫ్ సబ్ స్టేషన్(DLF Sub Station) నుండి గ్రామానికి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసి 24గంటల విద్యుత్ సరఫరాను అందించి ప్రజల కళ్లలో వెలుగులు విరజిమ్మేలా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అదేవిధంగా నందిగామ గ్రామ ముఖ ద్వారంలో ప్రధాన సమస్య(The main problem)గా ఉన్న ఇరుకు రోడ్డును వాహనదారులకు సౌకర్యార్థం విశాలంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామానికి చేసిన అభివృద్ధిని ప్రజలు గ్రహించాలని కల్లబొల్లి మాటలతో బురిడీ కొట్టించేందుకు(To be buried) కొందరు వస్తుంటారని వారిని నమ్మి మోసపోవొద్దని అభివృద్ధిని కుంటు పర్చొద్దని సూచించారు. ఒకే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి.. నన్ను గెలిపించండి.. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సహకరించండి అని కొమ్ము వెంకటయ్య ప్రజలను కోరారు.

Leave a Reply