Nagayalanka | శ్రీ గంధంతో వేణు గోపాలుడికి అలంకరణ

Nagayalanka | నాగాయలంక – ఆంధ్రప్రభ : ధనుర్మాసం సందర్భంగా ఇవాళ స్థానిక శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో మూల విరాట్ కు ఐదు కిలోల శ్రీగంధంతో అలంకరణ చేయగా, భక్తులకు కనువిందు చేశారు. అర్చకులు డివికే.సత్యప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రముఖుడు మండవ బాబురావు శ్యామలాదేవి దంపతులు, మద్ది సుబ్బారావు రాజేశ్వరి దంపతులు ప్రసాదం వితరణ చేశారు.
