కాంగ్రెస్ అభ్యర్థి ఎండి హబీబ్ ను గెలిపించండి

పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 7 ఆంధ్రప్రభ నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ పదవ వార్డు అభ్యర్థి ఎండి హబీబ్ ను గెలిపించాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి ఓటర్లను కోరారు శనివారం రాత్రి 10వ వార్డు లో ఎంపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి ఎండి హబీబ్ లతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలతో కలిసి బొడ్డెమ్మ ఆడారు అనంతరం జరిగిన సభలోఓటర్లకు కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు నాగర్ కర్నూల్ పట్టణాన్ని అభివృద్ధి చేశామని ఇంకా రాబోయే కాలంలో పట్టణాన్ని అభివృద్ధి కార్యక్రమాలతో నిర్మాణం చేస్తామని చెప్పారు
ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1000 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు విద్య వైద్యం వ్యవసాయ రంగ ప్రాధాన్యంలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని మల్లు రవి చెప్పారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నాగర్ కర్నూల్ లో నూతనంగా వైద్య కళాశాల నిర్మాణం 235 కోట్లతో చేపడుతున్నామని అదేవిధంగా జూనియర్ కళాశాల నూతన భవనం కొత్తగా నూతన బస్టాండు చేపడతామని, 65 కోట్లతో సిసి రోడ్లు ఎండబెట్ల బ్రిడ్జి ఇలా అనేక అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ వల్లభ రెడ్డి మాజీ సర్పంచ్ బోనాస్ రాములు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వినోద్ కాంగ్రెస్ నాయకులు సలీం నసీర్ పాండు చారి కొండా నగేష్ నాయకులు కార్యకర్తలు ఓటర్లు పాల్గొన్నారు
