PROMOTION | కాటారం ట్రాన్స్ కో డీఇ గా నాగరాజు

PROMOTION | కాటారం ట్రాన్స్ కో డీఇ గా నాగరాజు


-ఏ డీ నుండి డిఇ గా ప్రమోషన్ కాటారం లో పోస్టింగ్

PROMOTION |కాటారం, ఆంధ్ర ప్రభ : జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలో నూతనంగా ఏర్పడిన కాటారం ట్రాన్స్కో సబ్ డివిజన్ డీఇగా దికొండ నాగరాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు కాటారం, భూపాలపల్లి ఇన్చార్జి ఏడీగా విధులను నిర్వర్తిస్తున్న నాగరాజు డీఇ ప్రమోషన్ (Nagaraju DE Promotion) పొందారు. ఇటీవల కాటారంకు ట్రాన్స్కో డివిజన్ కేంద్రం మంజూరు అయింది. ఆదివారం ట్రాన్స్కో ఎడి కార్యాలయం ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో నాగరాజు డిఇ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ ఇ మంచూర్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా ఎస్ ఇ నుండి నాగరాజు ప్రమోషన్ సంబంధించిన సర్టిఫికెట్ను అందుకున్నారు.

గత రెండు సంవత్సరాల కాలం నుండి కాటారం ఏడీగా సమర్థవంతమైన విధులను నిర్వర్తించి, కాటారం సబ్ డివిజన్ (Kataram Sub-Division) ప్రజలకు, వినియోగదారులకు విశిష్ట సేవలను అందించారు. డీ ఇ గా నాగరాజు బాధ్యతలు స్వీకరించడంతో తోటి ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ ఇంజనీర్ చందర్ రెడ్డి, మహ ముత్తారం ఏఇ ప్రశాంత్, కొయ్యురు ఏ ఇ శేఖర్, మహదేవపూర్ శ్రీకాంత్, పలిమెల ఏ ఇ మంగీలాల్, కాటారం లైన్ ఇన్స్పెక్టర్ కిరణ్ కాంత్, లైన్మెన్ తిరుపతి రెడ్డి, లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply