స్కూల్ బస్సులను తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారి..

స్కూల్ బస్సులను తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారి..

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : విద్యార్థుల భద్రత దృష్ట్యా సోమవారం ఉదయం నుండి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, మహబూబాబాద్, తొర్రూరు ఎస్సై ఉపేందర్ సంయుక్తంగా స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ బస్సులకు సంబంధించిన అన్ని సెక్యూరిటీ ప్రికాషన్స్, అవసరమైన డాక్యుమెంట్లు, డ్రైవర్ లైసెన్సులు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు, ఇన్సూరెన్స్, పర్మిట్ తదితర పత్రాలను పరిశీలించారు.

అలాగే బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, ఎమర్జెన్సీ డోర్, సీసీ కెమెరాలు, స్పీడ్ గవర్నర్, జీపీఎస్ సిస్టమ్ వంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా లేదా అనే విషయాలను కూడా అధికారులు పరిశీలించారు. నిబంధనలు పాటించని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply